బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 25 మే 2022 (10:20 IST)

ఈ యేడాది కూడా చేప మందు పంపిణీ లేదు : బత్తిన బ్రదర్స్ ప్రకటన

fish prasadam
ప్రతి యేటా మృగశిర కార్తె సందర్భంగా ఉబ్బసం రోగులు (ఆస్తమా) రోగులకు చేపల ప్రసాదాన్ని పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తుంది. అయితే, కరోనా ప్రభావం కారణంగా గత మూడేళ్లుగా ఈ చేపల మందును పంపిణీ చేయడం లేదు. ఇపుడు ఈ యేడాడి కూడా పంపిణీ చేయడం లేదని బత్తిన సోదరులు వెల్లడించారు. 
 
ఇదే అంశంపై చేప ప్రసాదం పంపిణీ నిర్వాహకుల్లో ఒకరైన బత్తిన గౌరీ శంకర్ మాట్లాడుతూ, తమ పూర్వీకులు సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇప్పటివరకు ప్రతి యేడాది మృగశిరకార్తె సందర్భంగా ప్రభుత్వ సహాయంతో నాంపల్లి ఎగ్జిబినష్ గ్రౌండ్‌లో వివిధ ప్రాంతాలకు చెందిన ఆస్తమా రోగులకు ఉచితంగా చేప ప్రసాదాన్ని అందిస్తున్నామన్నారు. 
 
అయితే, కరోనా మహమ్మారి వెలుగు చూసిన తర్వాత గత మూడేళ్లుగా ఇది నిలిపివేసినట్టు తెలిపారు. ఇపుడు ఈ కరోనా ప్రభావం కారణంగా ఈ యేడాది కూడా ప్రసాదాన్ని పంపిణీ చేయడం లేదని ఆయన తెలిపారు. అందువల్ల చేప ప్రసాదం కోసం ఏ ఒక్కరూ హైదరాబాద్ నగరానికి రావొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.