1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 23 డిశెంబరు 2021 (14:41 IST)

గూడెం గ్రామంలో ఒమిక్రాన్ కలకలం - 10 రోజుల లాక్డౌన్

తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ వైరస్ పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే పాజిటివ్ కేసుల నమోదుతో దేశంలోనే నాలుగో స్థానంలో ఉంది. ఈ క్రమంలో రాజన్న సిరిసిల్లా జిల్లాలోని ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో ఒమిక్రాన్ వైరస్ కలకలం రేపింది. ఇటీవల దుబాయ్ నుంచి ఈ గూడెం గ్రామానికి వచ్చిన ఓ వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్ తేలింది. 
 
ఆ తర్వాత అతని కుటుంబ సభ్యులకు జరిగిన పరీక్షల్లో అతని తల్లి, భార్యకు కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో వారి శాంపిల్స్ సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించింది. ఇదిలావుంటే, ఈ గ్రామంలో కరోనా కలకలం చెలరేగడంతో అప్రమత్తమైన ఆరోగ్య శాఖ అధికారులు కఠిన ఆంక్షలు విధించారు. అలాగే, గ్రామస్తులు కూడా స్వయంగా సెల్ఫ్ లాక్డౌన్ విధించుకున్నారు.