మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శుక్రవారం, 22 జనవరి 2021 (09:35 IST)

బోల్తాపడిన ట్రాక్టర్‌.. 20 మంది కూలీలకు గాయాలు.. ఎక్కడ?

మహబూబాబాద్ జిల్లాలోని నెల్లికుదురులో కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్‌ బోల్తాపడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 20 మంది గాయపడ్డారు. మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి నుంచి 30 మంది ఇసుక ఎత్తేందుకు ట్రాక్టర్‌లో వెళ్తున్నారు.

అయితే కొద్దిదూరం వెళ్లిన ట్రాక్టర్‌ ఉదయం 6 గంటల ప్రాంతంలో అదుపు తప్పిన ట్రాక్టర్‌ బోల్తాపడింది. దీంతో అందులో ఉన్న 20 మంది కూలీలు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

గాయపడినవారిని 108 అంబులెన్సులో సమీపంలోని దవాఖానకు తరలించారు. అయితే అందులో నలుగురికి తీవ్రంగా గాయాలవడంతో మహబూబాబాద్‌లోని జిల్లా దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.