శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : బుధవారం, 1 ఏప్రియల్ 2020 (20:01 IST)

కరోనా అంతానికి చిలుకూరులో పాదుకా పట్టాభిషేకం

అలనాడు శ్రీరాముని  పట్టాభిషిక్తుడ్ని  చేయాలనుకున్న సమయంలో  కైకేయి  దశరథుని రెండు వరాలు అడుగుతుంది -  రాముని అరణ్యవాసం , భరతుని పట్టాభిషేకం. 

సీతా రాములిద్దరూ నారబట్టలతో రాజ్యాన్ని విడిచి వనవాసానికేగుతారు. రాముని అరణ్య వాసం తరువాత భరతుడ్ని పట్టాభిషిక్తుడ్ని చెయ్యాలనే కైకేయి కోరికకు భరతుడు తిరస్కరించి రాముడ్ని వెదుకుకుంటూ  అడవికి వెళ్ళి అన్నని  బతిమాలడం, రాముడు అంగీకరించకపోవడంతో ఆయన పాదుకలు తీసుకుని సింహాసనం మీద వాటిని పెట్టి రాజ్యం చేయడం మనకు తెలిసిందే.

తండ్రి మాట జవదాటని కొడుకుగా శ్రీరామ చంద్రుడు, అన్నపై అపారమైన వాత్సల్యం వున్న తమ్ముడుగా భరతుడు మనకు ఆదర్శం. 
 
చైనాలో వెలుగులోకి వచ్చి కరోనా ప్రపంచ దేశాలకు భయంకరంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో భారతదేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.

ఎవరూ ఊహించని విధంగా వచ్చిన కరోనా వైరస్ ప్రజలందరినీ భయబ్రాంతులకు గురి చేస్తుంది. చైనాలోని ఉహాన్‌లో మొదలైన ఈ వైరస్ ఇరాన్, దక్షిణ కొరియా, ఇటలీ, బ్రిటన్, అమెరికా, జపాన్, ఫిలిప్పీన్స్, థాయ్‌ల్యాండ్, ఇరాన్, నేపాల్, పాకిస్తాన్, భారత్‌లను తాకింది.

ఢిల్లీతో సహా పలు ప్రాంతాల్లో కరోనా మరణాలు వేలల్లో ఉన్నాయి. ఇప్పటికే గడిచిన కొన్ని నెలల కాలంలోనే సుమారు 160 దేశాల వరకు విస్తరించింది. దీనికి సరైన వైద్య చికిత్స అందుబాటులో లేని కారణంచేత వైరస్ వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఒక్కటి మాత్రమే మార్గం. అందుకే చిలుకూర్లో పాదుకా పట్టాభిషేకం నిర్వహించడం విశేషం.