గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (17:15 IST)

ఎలుకల కోసం పెట్టిన మందు.. కర్భూజ తినడంతో ఇద్దరు చిన్నారులు..?

ఎలుకల కోసం పెట్టిన మందు రెండు నిండు ప్రాణాలను బలిగొంది. పెద్దపల్లి జిల్లాలో ఈ విషాదం నెలకొంది. అంతర్గాం మండలంలోని విస్సంపేట గ్రామానికి చెందిన ఒకే కుటుంబంలోని ఐదుగురు వ్యక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విషాహారం తిన్న వీరిలో ఇద్దరు మృతి చెందగా.. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. దారబోయిన శ్రీశైలం-గుణావతి దంపతులు ఇంట్లో ఎలుకల కోసం మందు పెట్టగా ఎలుకలు మందుతోపాటు కర్భూజను కూడా తిన్నాయి.
 
ఆ కర్భూజను కుటుంబంలోని ఐదుగురు తిన్నారు. దీంతో అస్వస్థతకు కుటుంబ సభ్యులు గురికాగా కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు కుమారులు దారబోయిన శివానంద్(10), శరణ్ మృతి చెందారు. తల్లిదండ్రుల పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. వృద్ధురాలి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.