ఆదివారం, 29 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 5 సెప్టెంబరు 2021 (15:58 IST)

మూడోదశపై ముందస్తు ప్రణాళికలు.. కొత్తగా 600 పడకలు

కరోనా మూడో దశ వ్యాప్తి తప్పదని వైద్య నిపుణులు పదేపదే హెచ్చరిస్తున్నారు. ఈ ముప్పును విజయవంతంగా ఎదుర్కొనేందుకు సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిని వైద్య ఆరోగ్యశాఖ సిద్ధం చేసింది. ఇందుకోసం అదనంగా మరో 600 పడకలను ఏర్పాటు చేస్తున్నారు. వీటితో కలిపి మొత్తం పడకల సంఖ్య 2500 వరకు చేరనున్నాయి. 
 
అయితే, కరోనా మూడో దశ ఉంటుందా? లేదా? అన్నది పక్కన పెడితే.. ఒకవేళ కొవిడ్‌ కేసులు పెరిగితే ఎదుర్కొనేలా వైద్య ఆరోగ్యశాఖ ముందుగానే ప్రణాళిక సిద్ధం చేస్తోంది. కరోనా చికిత్సలకు నోడల్‌ కేంద్రంగా ఉంటున్న గాంధీలో అదనంగా మరో 600 పడకలను ఏర్పాటు చేస్తున్నారు. 
 
మరోవైపు మూడో దశ పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతుందనే విశ్లేషణల నేపథ్యంలో పిల్లల చికిత్సల కోసం గ్రౌండ్‌, మొదటి, రెండో అంతస్తుల్లో ఆక్సిజన్‌, ఐసీయూలతో కూడిన మరో 300 పడకలను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. వారం పది రోజుల్లో ఈ పనులు కొలిక్కి రానున్నాయి. మొత్తం పడకల సంఖ్య 2,500 వరకు చేరనున్నాయి.