దూకుడు పెంచిన రేవంత్ రెడ్డి, ఆ నేతలందరూ కాంగ్రెస్ వైపేనా..?
ఇంకా పిసిసి అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టనేలేదు. అంతనోనే రేవంత్ రెడ్డి తనకు బాగా పరిచయమైన వ్యక్తులను కాంగ్రెస్ పార్టీలోకి లాగాలని చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని చూస్తున్నారు. తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టలోపు సీనియర్ నాయకులు పార్టీలో ఉండాలన్నది రేవంత్ ఆలోచన.
ఆ దిశగా రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు. గత్యంతరం లేక 2018ఎన్నికల్లో టిఆర్ ఎస్ పార్టీలో కొంతమంది చేరారు. టిడిపి నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ లోకి వలసలు బాగానే వెళ్ళాయి. అయితే అందులో సీనియర్ లీడర్లకు కొంతమందికి చోటు దక్కలేదు.
సరైన అవకాశం.. పోస్టులు ఇవ్వకపోవడంతో చివరకు నేతలందరూ టిఆర్ఎస్‌లో ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఏమీ చెప్పుకోలేని పరిస్థితుల్లో కొంతమంది నేతలు సైలెంట్‌గా టిఆర్ఎస్‌లో ఉంటున్నారు. అయితే ప్రస్తుతం రేవంత్ రెడ్డి రాకతో కొంతమంది నేతలు ఆవైపుగా చూస్తున్నారట. మరి రేవంత్ రెడ్డి ఎఫెక్ట్ ఎంతమేరకు చూపుతుందో చూడాలి.