1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 24 జూన్ 2023 (16:36 IST)

స్కూల్ టైమింగ్స్‌లో మార్పు.. తెలంగాణ విద్యాశాఖ

schools kids
స్కూల్ టైమింగ్స్‌లో మార్పు చేసే ఆలోచనలో తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం ప్రైమరీ స్కూల్స్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తెరుస్తున్నారు. హైస్కూల్స్ ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు తెరిచి ఉంటున్నాయి. 
 
హైదరాబాద్‌లో మాత్రం కొంత సమయం ముందుగానే పాఠశాలలు ప్రారంభం అవుతాయి. ప్రైమరీ స్కూల్స్‌ విద్యార్థులకు ఉదయం 9.30 గంటలకు స్కూల్స్ ఓపెన్ చేయాలని పలువురు ప్రజాప్రతినిధులు విద్యాశాఖ దృష్టికి తీసుకొచ్చారు.
 
మరోవైపు స్కూల్ టైమింగ్స్ మార్పు చేయాలన్న అంశంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ప్రైవేటు స్కూల్స్‌లో ఉదయం 7.30 గంటలకే చిన్న పిల్లల్ని వాహనాల్లో ఎక్కించుకొని వెళ్తున్నారని.. అందుకు భిన్నంగా ప్రభుత్వ పాఠశాలలు ఆలస్యంగా ప్రారంభిస్తే విద్యార్థుల సంఖ్య మరింత తగ్గే ప్రమాదం ఉందని అంటున్నారు.