శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (21:17 IST)

సికింద్రాబాద్‌లో ఘోరం.. పబ్లిక్ టాయ్‌లెట్‌లో మహిళ మృతదేహం

సికింద్రాబాద్‌లో ఘోరం జరిగింది. సికింద్రాబాద్ రహదారి పక్కన ఉన్న పబ్లిక్ టాయిలెట్‌లో ఓ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. మహిళపై అత్యాచారం చేసి హత్య చేసివుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. 
 
దుండగులతో పెనుగులాటలో మహిళ తీవ్రంగా ప్రతిఘటించడంతో ఆమెను హత్య చేసి నిందితులు పరారైనట్లు అనుమానిస్తున్నారు. బాధిత మహిళ ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
 
అత్యాచారం, హత్యగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా ఘటనకు సంబంధించిన వివరాలు, నిందితుల ఆచూకీని కనిపెట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కాగా, రద్దీగా ఉండే ప్రాంతంలోని టాయిలెట్‌లో ఈ దారుణం జరగడం స్థానికంగా కలకలం రేపింది.