సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : గురువారం, 17 సెప్టెంబరు 2020 (06:41 IST)

హైదరాబాద్‌ లో అంబేద్కర్‌ విగ్రహం.. నమూనా ఇదే

హైదరాబాద్‌ నడిబడ్డున ఎన్‌టిఆర్‌ గార్డెన్‌ పక్కన నిర్మించబోయే 125 అడుగుల డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ విగ్రహ నమూనా చిత్ర పటాన్ని ఐటి మంత్రి కెటిఆర్‌, ఎస్‌సి సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ విడుదల చేశారు.

విగ్రహ ఏర్పాటుకు సంబంధించిన జిఒను ప్రభుత్వం విడుదల చేసింది. ఐమాక్స్‌ సమీపంలో 11 ఎకరాల విస్తీర్ణంలో రూ.140కోట్ల వ్యయంతో అంబేద్కర్‌ పార్కును ఏర్పాటు చేయనున్నారు.

అంబేద్కర్‌ భారీ విగ్రహంతో పాటు స్టడీ సెంటర్‌, లైబ్రరీ, అంబేద్కర్‌ జీవిత విశేషాలు తెలిపే ఫొటో ప్రదర్శనశాల, తదితరాలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.