గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 17 మే 2022 (15:18 IST)

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి‌కి కేటీఆర్ సూపర్ ఆఫర్

Ponguleti srinivas reddy
Ponguleti srinivas reddy
ఖమ్మం మాజీ ఎంపీ, టీఆర్ఎస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి‌కి కేటీఆర్ రాజ్యసభ ఆఫర్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. 2014లో వైసీపీ తరుపున ఎంపీగా గెలిచినా శ్రీనివాస్ రెడ్డిని సామాజిక సమీకరణాల్లో భాగంగా ఎంపీ సీటు నామాకు కేటాయించడంతో గత మూడు సంవత్సరాలుగా ఎలాంటి పదవి లేకుండా ఉన్నారు . ఇటీవల కాలంలో పార్టీ మారుతున్నాడంటూ వార్తలు తరచు చక్కర్లు కొడుతున్నాయి. 
 
కానీ ఆయన మాత్రం అనేక సార్లు తాను పార్టీ మారడంలేదని కేటీఆర్‌పై నమ్మకం ఉందని ఆయనపైనే భారం వేశానని చెప్పినప్పటికీ అవి ఆగడంలేదు . ఆయన నమ్మకాన్ని నిలబెడుతూ కేటీఆర్ నేడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించి రాజ్యసభ సీటును ఆఫర్ చేశారు.
 
రాజ్యసభ సీటు కూడా బండ ప్రకాష్ రాజీనామా చేసింది కాకుండా ఖాళీ అవుతున్న మరో రెండు స్థానాల్లో ఒకటి ఇచ్చేందుకు సిద్ధమైయ్యారని సమాచారం. దీనిపై పొంగులేటి ఎటు తేల్చుకోలేక పోతున్నారని సమాచారం.