సిద్దిపేటలో ‘స్వచ్ఛబడి ’

swacha badi
ఎం| Last Modified శనివారం, 10 ఏప్రియల్ 2021 (20:03 IST)
తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌, గణీతం, సైన్సు, సోషల్‌ సబ్జెక్టుల గురించి పాఠశాలల్లో ఉపాధ్యాయులు పాఠాలు చెబుతారు. కానీ చెత్త సేకరణ, ప్రజారోగ్యం, తడి,పొడి, హానికరమైన చెత్తను వేరు చేయడం, ప్లాస్టిక్‌ నివారణ, చెత్తతో ఇళ్లలోనే ఎరువు తయారీ చేసే విధానాలను తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఈ సిద్దిపేట లోని స్వచ్ఛబడికి వెళ్లాల్సిందే.

ఆ దిశగా మంత్రి హరీష్ రావు గారి ప్రత్యేక చొరవతో దక్షిణ భారతదేశంలో బెంగళూరు తర్వాత మన సిద్దిపేటలోనే ‘స్వచ్ఛబడి’ని ఏర్పాటు చేశారు. త్వరలోనే చెత్త గురించిన పాఠాలు చెప్పనున్నారు. పాత ఎంసీహెచ్‌(మెటర్నిటీ) ఆస్పత్రిలో అన్ని హంగులతో ఈ బడిని ఏర్పాటు చేయడం జరిగింది.

అన్ని వర్గాల వారికి ఇక్కడ డిజిటల్‌ క్లాసుల్లో పాఠాలు బోధించి, ఆ తర్వాత ప్రాక్టికల్‌గా వివరిస్తారు. మంత్రి హరీశ్‌రావు గారి చొరవతో బెంగళూరుకు చెందిన పర్యావరణ సామాజిక కార్యకర్త శాంతి గారు ఈ స్వచ్ఛబడిని పర్యవేక్షిస్తున్నారు.రేపు మంత్రి హరీష్ రావు గారు స్వస్ పాఠశాలను ప్రారంభించనున్నారు.
దీనిపై మరింత చదవండి :