శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 19 జూన్ 2021 (16:37 IST)

తెలంగాణలో లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేత.. జూలై 1 నుంచి విద్యా సంస్థలు ప్రారంభం

తెలంగాణలో రాష్ట్రంలో జూన్ 20వ తేదీ నుంచి లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తివేస్తూ తెలంగాణ స‌ర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విద్యాసంస్థల పునఃప్రారంభంపై కూడా కేబినెట్ భేటీలో చర్చించారు. జులై 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 
 
జులై 1 నుంచి అన్ని రకాల విద్యాసంస్థలను ప్రారంభించాలని విద్యాశాఖ అధికారుల‌ను మంత్రివర్గం ఆదేశించింది. పూర్తిస్థాయి సన్నద్థతతో విద్యాసంస్థలను పున:ప్రారంభించాలని స్ఫష్టం చేసింది. 
 
మరోవైపు, తెలంగాణ‌లో లాక్ డౌన్‌ను పూర్తిగా ఎత్తివేశారు. ఈ మేరకు లాక్ డౌన్‌ను పూర్తిగా ఎత్తేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ శాతం గణనీయంగా తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 
 
తెలంగాణలో కరోనా పూర్తి నియంత్రణలోకి రావడంతోనే వైద్యశాఖ అధికారులు ప్రతిపాదన మేరకు లాక్ డౌన్‌ను ఎత్తి వేయాలని నిర్ణయించారు. లాక్ డౌన్ సందర్భంగా విధించిన అన్ని రకాల నిబంధనలను పూర్తిస్థాయిలో ఎత్తివేయాలని అన్ని శాఖల అధికారులను మంత్రివర్గం ఆదేశించింది.