1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 19 సెప్టెంబరు 2022 (09:08 IST)

ఇండిగో సిబ్బంది తీరును ఎండగట్టిన మంత్రి కేటీఆర్ - ట్వీట్ వైరల్

indigoflight
దేశంలోని ప్రముఖ ప్రైవేట్ విమానయాన సంస్థల్లో ఒకటైన ఇండిగో విమాన సంస్థకు చెందిన సిబ్బంది తీరును తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎండగట్టారు. హిందీ, ఇంగ్లీష్ మాట్లాడటం రాని ఓ మహిళా ప్రయాణికురాలి పట్ల ఇండిగో విమానం సిబ్బంది తీరును ఆయన ఖండించారు. భద్రతా కారణాలు చూపి ఆ మహిళా ప్రయాణికురాలి సీటును మార్చడాన్ని మంత్రి కేటీఆర్ తప్పుబట్టారు. తెలుగు మహిళ సీటు మార్చి వివక్ష చూపారంటూ అహ్మదాబాద్ ఐఐఎం అసిస్టెంట్ ప్రొఫెసర్ చేసిన ట్వీట్‌ను మంత్రి కేటీఆర్ షేర్ చేశారు. ఆయా రాష్ట్రాల్లో నడిపే విమాన సర్వీసుల్లో స్థానిక భాషలు మాట్లాడే సిబ్బందిని నియమించుకోవాలని ఇండిగోకు మంత్రి కేటీఆర్ సలహా ఇచ్చారు. 
 
ఈ నెల 16వ తేదీన ఓ మహిళా ప్రయాణికురాలు విజయవాడ నుంచి హైదరాబాద్ నగరానికి వెళ్లే ఇండిగో విమానం 6ఈ 7297లో ప్రయాణిస్తుండగా, ఆమెకు ఇంగ్లీష్, హిందీ రాదన్న కారణంతో కూర్చొన్న సీట్లో నుంచి తీసుకెళ్లి మరో చోట కూర్చోబెట్టారు. ఈ ఘటనపై అహ్మదాబాద్ ఐఐఎంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ దేవస్మిత తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. 
 
విమానంలో 2ఎ సీట్లో ఎగ్జిట్ డోర్ దగ్గర కూర్చుకున్న సదరు మహిళకు హిందీ/ఇంగ్లిష్ రాదని తెలుసుకొని 3సి సీట్లోకి మార్చేశాని, ఆమెతో మాట్లాడిన ఫ్లైట్ అటెండెంట్ భద్రతాపరమైన ఆందోళనగా పేర్కొంటూ ఆ మహిళ పట్ల వివక్ష ప్రదర్శించారని ట్వీట్ చేశారు. సదరు తెలుగు మహిళ ఫొటోను కూడా షేర్ చేశారు. 
 
దీనిపై కేటీఆర్  స్పందించి ట్వీట్ చేశారు. స్థానిక భాషలు మాత్రమే మాట్లాడగలిగిన ప్రయాణికులను కూడా గౌరవించాలని సూచిస్తూ ఇండిగో యాజమాన్యానికి ట్యాగ్ చేశారు. విమానాలు ప్రయాణించే మార్గాల ఆధారంగా ఆయా భాషలు మాట్లాడగలిగే సిబ్బంది నియమించుకోవాలని ఇండిగోకు సూచించారు. అలా అయితే, ప్రయాణికులు, సిబ్బందికి ఎలాంటి ఉండదని అభిప్రాయపడ్డారు.