శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : శుక్రవారం, 12 జనవరి 2018 (10:49 IST)

'కమలం'కు టాటా... 'హస్తం' గుర్తుకు జై అంటున్న నాగం జనార్థన్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి ఆ రాష్ట్రంలో సీనియర్ నేతగా ఉన్న నాగం జనార్ధన్ రెడ్డి గుడ్‌బై చెప్పారు. అదేసమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు ప్రకటించారు

తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి ఆ రాష్ట్రంలో సీనియర్ నేతగా ఉన్న నాగం జనార్ధన్ రెడ్డి గుడ్‌బై చెప్పారు. అదేసమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు ప్రకటించారు. పార్టీలో తనకు సరైన గుర్తింపు దక్కలేదని భావిస్తున్న మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి ఆరోపిస్తూ, పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. 
 
కేసీఆర్ ప్రభుత్వంపై అలుపెరగని పోరాటం చేస్తున్న తాను పార్టీలో నిరాదరణకు గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. తనలాంటి అనుభవజ్ఞుడి సేవలను వినియోగించుకోవడంలో పార్టీ విఫలమైందన్నారు. పార్టీలో తాను పలుమార్లు అవమానానికి గురయ్యానని తెలిపారు. అనుచరులు, అభిమానుల సూచనతోనే తాను పార్టీని వీడుతున్నట్టు స్పష్టం చేశారు.
 
అదేసమయంలో ఆయన కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి వంటి పలువురు టీడీపీ నేతలు సొంత పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెల్సిందే. పైగా, కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలంతా రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలే కావడం గమనార్హం. అందువల్ల నాగం జనార్ధన్ రెడ్డి హస్తం గుర్తుకే ఓటువేయనున్నారు.