తెలంగాణా రాష్ట్రంలో నేటి నుంచి యాసంగి ధాన్యం కొనుగోళ్లు
తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం నుంచి యాసంగి ధాన్యం కొనుగోళ్ళ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయనుంది. ఈ ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ గురువారం స్పష్టతనిచ్చారు. ఇందుకోసం అన్ని జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
దీంతో శుక్రవారం నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభంకానుంది. ఈ సీజన్‌లో దాదాపు 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని భావిస్తుంది. ఈ ధాన్యం సేకరణకు 15 కోట్ల గోనె సంచలు కావాల్సివుంది. కానీ, ప్రస్తుతం 8 కోట్ల పాత గోనె సంచులకు ప్రభుత్వం టెండర్ల ద్వారా సేకరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.