సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 14 ఏప్రియల్ 2022 (18:01 IST)

ఏపీ జడ్జిలు వద్దంటూ తెలంగాణ హైకోర్టు వద్ద ఆందోళన

telangana high court
తెలంగాణ జడ్జిలను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేస్తూ... ఏపీ జడ్జిలను తెలంగాణకు బదిలీ చేస్తున్నారని తెలంగాణ న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. 
 
తెలంగాణ జడ్జిలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ జడ్జిలు వద్దంటూ తెలంగాణ హైకోర్టు వద్ద తెలంగాణ న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. 
 
ఈ అంశంపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. తెలంగాణకు చెందిన జడ్జిలను ఇతర ప్రాంతాలకు బదిలీ చేయొద్దని కోరతామని అన్నారు. సీజేఐకి ఫిర్యాదు చేస్తామన్నారు.