1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 8 ఏప్రియల్ 2022 (13:30 IST)

కారు ఆపి హోంగార్డును అభినందించిన తెలంగాణ హైకోర్టు సీజే

ts cj
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ శుక్రవారం హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో హోంగార్డు అష్రఫ్ అలీని ఘనంగా సన్మానించారు. బషీర్‌బాగ్‌లోని బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహం వద్ద తన విధులు నిర్వహిస్తున్నప్పుడు సిజె సతీష్ చంద్ర తన కారును ఆపి, హోంగార్డును సత్కరించారు.
 
అలీ విధులు నిర్వర్తిస్తున్న తీరును ప్రధాన న్యాయమూర్తి రోజూ గమనిస్తున్నారని, శుక్రవారం ఆయన తన కారును ఆపి, విధి నిర్వహణలో నిబద్ధతను మెచ్చుకున్నారని చెబుతున్నారు. మీడియాతో అష్రఫ్ అలీ సంతోషం వ్యక్తం చేస్తూ.. తన విధి నిర్వహణకు కట్టుబడి ఉన్నందుకు సీజే సతీష్ చంద్ర అభినందనలు తెలిపారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తే తనను అభినందించడంతో అష్పర్ అలీ ఉప్పొంగిపోయాడు.