1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 17 జులై 2021 (09:06 IST)

రూ.కోట్లలో కోకాపేట భూములు - ఎకరం రూ.55 కోట్లు

తెలంగాణ రాష్ట్రంలోని కోకాపేట భూముల ధర కోట్లాది రూపాయలు పలికింది. ఎకరం భూమి రూ.55 కోట్ల మేరకు అమ్ముడు పోయింది. దీన్నిబట్టే ఈ భూముల ధరలు ఏ విధంగా ఉన్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. 
 
గత గురువరారం తెలంగాణ ప్రభుత్వం కోకాపేటలో 45 ఎకరాల ప్రభుత్వ భూములను వేలం వేసింది. అలాగే, శుక్రవారం ఖానామెట్‌లో భూములను వేలం వేసింది. ఈ మేరకు 15 ఎకరాల్లోని 5 ప్లాట్లకు వేలం నిర్వహించారు. 
 
అత్యధికంగా ఒక ఎకరం రూ.55 కోట్లు, సగటున ఒక్కో ఎకరం రూ.48.92 కోట్లు పలికింది. భూముల అమ్మకం ద్వారా ప్రభుత్వానికి రూ.729.41 కోట్ల ఆదాయం సమకూరింది. లింక్‌వెల్ టెలీ సిస్టమ్స్, జీవీపీఆర్ ఇంజినీర్స్, మంజీరా కన్‌స్ట్రక్షన్స్ కంపెనీలు భూములను దక్కించుకున్నాయి.
 
కాగా కోకాపేట, ఖానామెట్ భూముల వేలంతో తెలంగాణ ప్రభుత్వానికి రూ.2,729 కోట్ల ఆదాయం లభించడం విశేషం. కోకాపేట శివారులో త్వరలో ఐటీ హబ్ రానున్న సంగతి తెలిసిందే. దీంతో ఇక్కడ భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. పైగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వేరుపడిన తర్వాత అక్కడి భూముల ధరలు ఈ స్థాయిలో అమ్ముడు పోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.