గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : బుధవారం, 4 జనవరి 2023 (12:51 IST)

తెలంగాణాలో వెలుగుచూసిన కోవిడ్ సూపర్ వేరియంట్ ఎక్స్ బీబీ15

telangana covid
తెలంగాణా రాష్ట్రంలోకి కోవిడ్ సూపర్ వేరియంట్ ఎక్స్ బీబీ 15 ప్రవేశించింది. అమెరికా, ఇంగ్లండ్ వంటి దేశాల్లో కరోనా వేవ్‌కు ప్రధాన కారణంగా నిలిచిన ఈ వేరియంట్ కేసులను తాజాగా తెలంగాణాలో మూడింటిని గుర్తించారు. 
 
నిజానికి ఈ తరహా కేసులను ఇప్పటికే గుజరాత్, కర్నాటక, మహారాష్ట్రలలో గుర్తించగా, తాజాగా తెలంగాణాలో కూడా గుర్తించడం ఆందోళనకు గురిచేస్తుంది. కాగా, డిసెంబరు - జనవరి 2వ తేదీల మధ్య ఈ తరహా కేసులను దేశంలో ఆరు కేసులను గుర్తించారు. ఈ వైరస్‌ను ప్రపంచంలో తొలిసారి న్యూయార్క్ దేశంలో గుర్తించారు. ఇది శరవేగంగా వ్యాప్తి చేసే వేరియంట్ అని, దీని వల్ల కరోనా వేవ్స్ మరితంగా పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. 
 
ఎక్స్ బీబీ 15 అనేక ఉత్పరివర్తనాలన పొందడం వల్ల ఇది ఇప్పటివరకు అత్యంత రోగనిరోధకశక్తి కలిగిన వేరియంట్‌గా మారిందని చెబుతున్నారు. అమెరికాలో చాలా మంది ఈ వైరస్ బారినపడిన విషయం తెల్సిందే.