ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 1 జులై 2022 (20:46 IST)

హన్మకొండ బీజేపీ ఆఫీస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత

కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు బీజేపీ ఆఫీస్ వద్ద ధర్నాకు దిగారు.  ఈ ఘటన హన్మకొండ బిజెపి ఆఫీస్ వద్ద చోటుచేసుకుంది. 
 
దీంతో అక్కడికి చేరుకున్న బీజేపీ నేతలు.. కాంగ్రెస్ నేతలను అడ్డుకోవడం తో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, ఘర్షణ జరిగింది.

ఇరువర్గాల పరస్పర దాడులతో బిజెపి ఆఫీస్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి లాఠీఛార్జి చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు.