సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: బుధవారం, 4 సెప్టెంబరు 2019 (16:14 IST)

ప్రయాణికుడిని చితకబాది 2 లక్షలు యూకె కరెన్సీ అపహరించిన క్యాబ్ డ్రైవర్

పదిహేను రోజుల్లో వివాహం ఉండటంతో యుకే నుండి వచ్చిన ప్రవీణ్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగి ఇంటికి వెళ్లడం కోసం ఓ ప్రైవేట్ క్యాబ్ బుక్ చేసున్నాడు. అయితే ఆ క్యాబ్ డ్రైవర్ దారి మళ్ళించి ప్రవీణ్‌ను గుర్తుతెలియని ప్రదేశానికి తీసుకెళ్ళి చితకబాది తన వద్ద ఉన్న రెండు లక్షల యుకే కరెన్సీ, బంగారు నగలను దోచుకుని వెళ్లిపోయాడు. 
 
దీంతో తండ్రికి ఫోన్ చేసిన ప్రవీణ్ జరిగిన విషయం చెప్పాడు. తను ఎక్కడున్నానో తెలియడం లేదని తను ఉన్న ప్రదేశంలో కొండపై గుడి ఉన్నట్లు తెలియజేశాడు. దీంతో హుటాహుటీన శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలిస్టేషన్‌కు చేరుకున్న బాధితుడి తండ్రి శేషగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 
 
ప్రవీణ్  సొంత గ్రామం ధమ్మాయిగుడా. ఎయిర్‌పోర్ట్ పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.