ప్రయాణికులకు శుభవార్త చెప్పిన రైల్వే శాఖ

uday train
Last Updated: బుధవారం, 28 ఆగస్టు 2019 (11:08 IST)
ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. శతాబ్ధి ఎక్స్‌ప్రెస్, తేజస్ ఎక్స్‌ప్రెస్, గతిమాన్ ఎక్స్‌ప్రెస్‌లలో ప్రయాణం చేసే ప్రయాణికులకు రైల్వేశాఖ ప్రయాణ ఛార్జీలో రాయితీ ఇవ్వనుంది. ఈ మూడు రైళ్ల టిక్కెట్ల చార్జీలను 25 శాతం మేరకు తగ్గించే దిశగా రైల్వే శాఖ యోచిస్తోంది.

రోడ్‌వేస్, ఎయిర్‌లైన్ ప్రయాణాలు చవకగామారిన తరుణంలో రైల్వేశాఖ ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూడు రైళ్లలో చార్జీలు అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రయాణికులు వీటిలో ప్రయాణించేందుకు ఆసక్తి చూపించడం లేదు. దీంతో ఈ రైళ్ల నుంచి తగినంత ఆదాయం కూడా లభించడం లేదని తెలుస్తోంది.

రైల్వేశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం గడచిన కొంతకాలంగా శతాబ్ధి, గతిమన్, తేజస్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో 50 శాతానికి మించిన సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. వీటిని భర్తీ చేసే ఉద్దేశంతో రైల్వేశాఖ టిక్కెట్ల చార్జీలను తగ్గించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.దీనిపై మరింత చదవండి :