మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వి
Last Modified: సోమవారం, 16 నవంబరు 2020 (20:17 IST)

పాడుబడిన ఇంట్లో యువ జంట మృతదేహాలు... ఎక్కడ?

నేటి యువతరం ప్రేమ అనే మాయ లోకంలో మునిగిపోతూ తమ విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఓ పాడుబడిన ఇంట్లో యువతి, యువకుడు మృతదేహాలు కుళ్లి పోయిన స్థితిలో చూసిన పోలీసులు సైతం దిగ్బ్రాంతికి గురైన ఘటన జగిత్యాల రూరల్ ప్రాంతంలో చోటుచేసుకున్నది.
 
మృతదేహాలు బాగా కుళ్లిపోవడంతో అక్కడ భయానక దృశ్యం కనిపించింది. హైదరాబాదులో ఓ పాడుబడిన ఇంట్లో నుంచి భరించలేని దుర్వాసన రావడంతో స్థానికులు పరిశీలించగా రెండు మృతదేహాలు కనిపించాయి. దాంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి పరిశీలించగా ఘటనా స్థలంలో యువతి, యువకుడు మృతదేహాలు కనిపించాయి.
 
ప్రక్కనే పురుగులమందు బాటెల్ కనిపించగా మొదట విషం తాగి తర్వాత ఉరి వేసుకొని చనిపోయినట్లు అంచనా వేశారు. వారిద్దరు ప్రేమికులై ఉంటారని భావిస్తున్నారు. అందులో యువకుడు హైదర్‌పల్లె గ్రామానికి చెందిన మధు అనే యువకుడని, అతనితో చనిపోయిన అమ్మాయి వివరాలు తెలియాల్సి ఉంది.
 
వీరి ఆత్మహత్యకు ప్రేమే కారణమా? లేదా ఇంకేమైనా వ్యవహారాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా యువకుడు మధు పది రోజులుగా కనిపించలేదనీ, దాంతో వారిరువురు అప్పుడే ఆత్మహత్య చేసుకొని ఉంటారని గ్రామస్తులు భావిస్తున్నారు.