శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : గురువారం, 26 డిశెంబరు 2019 (21:37 IST)

అనుమతి ఇవ్వకపోయినా ర్యాలీ నిర్వహిస్తాం: ఉత్తమ్

తెరాస, భాజపాలపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​రెడ్డి ధ్వజమెత్తారు. ఇక నుంచి రాష్ట్రంలో తెరాస, భాజపాలతో వేదిక కూడా పంచుకోబోమని ఉద్ఘాటించారు. అవకాశవాద రాజకీయాలు చేస్తూ... ప్రజలను తెరాస మోసం చేస్తోందని ఉత్తమ్​ మండిపడ్డారు.

అనుమతి ఇవ్వకపోయినా 'సేవ్​ నేషన్​... సేవ్​ కాన్సిటిట్యూషన్'​ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇక నుంచి తెరాస, భాజపాలతో కాంగ్రెస్​పార్టీ వేదిక పంచుకోబోదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఉద్ఘాటించారు.

తెరాస అవకాశవాద రాజకీయాలు చేస్తూ... ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతోందని ఆరోపించారు. రాహుల్, సోనియా నాయకత్వంలో సీఎఎ, ఎన్ఆర్‌సీలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ పోరాటం చేస్తోందని తెలిపారు. సెక్యులర్‌ దేశం కోసం కాంగ్రెస్​ పార్టీ పోరాడుతున్నట్లు వెల్లడించారు.

మతతత్వ పార్టీలతో కలిసి పనిచేస్తున్న తెరాస... సీఏఏపై ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా లబ్ది కోసం రాజకీయం చేయదని, రోజుకొక మాట మాట్లాడదన్నారు ఉత్తమ్​.