శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 24 డిశెంబరు 2021 (20:18 IST)

గుంతలో పడి ముగ్గురు బాలికలు దుర్మరణం

సెల్లార్ గుంతలో పడి ముగ్గురు బాలికలు ప్రాణాలు కోల్పోయిన ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. నిర్మాణం కోసం జరిపిన తవ్వకాల్లో పడి బాలికలు మృతి చెందారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో విషాదం చోటు చేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. సెల్లార్‌ కోసం తవ్విన గుంతలో ప్రమాదవశాత్తు బాలికలు పడిపోయిన బాలికలను రమ్య (7), సోఫీయా(12), సంగీత(14)గా గుర్తించారు. బాలికల మృతితో వారి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సెల్లార్‌ కోసం గుంత తవ్విన వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
గుంతపై ఎలాంటి పైకప్పు లేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు, మృతుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మాణం కోసం గుంతలు తవ్వినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.