1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 29 ఏప్రియల్ 2022 (12:47 IST)

రంజాన్- హైదరాబాదులో ట్రాఫిక్ ఆంక్షలు

traffic in hyderabad
రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో శుక్రవారం ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. జమాతుల్‌ విదాగా పిలిచే రంజాన్‌ మాసంలో ఆఖరి శుక్రవారం కావడంతో పాతబస్తీలోని మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు జరగనున్నాయి. 
 
ఈ రెండు కార్యక్రమాల నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో నిర్ణీత సమయాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు, మళ్లింపులు ఉంటాయని ట్రాఫిక్ విభాగ అధిపతి ఏవీ రంగనాథ్ ప్రకటించారు.  
 
ఎల్బీ స్టేడియంలో జరిగే ఇఫ్తార్‌ విందుకు సీఎం కేసీఆర్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ముస్లిం మత పెద్దలు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. 
 
ఆ సమయంలో వాహనాలను ఏఆర్‌ పెట్రోల్‌ పంప్‌- బీజేఆర్‌ విగ్రహం- బషీర్‌బాగ్‌ మార్గాల్లోకి అనుమతించరు. చాపెల్‌ రోడ్, నాంపల్లి వైపు నుంచి బీజేఆర్‌ స్టాట్యూ వైపు వచ్చే వాహనాలను ఏఆర్‌ పెట్రోల్‌ పంప్‌ నుంచి మళ్లిస్తారు. వీటిని కంట్రోల్‌ రూమ్‌ వైపు అనుమతించరు. బషీర్‌బాగ్‌ ఫ్లైఓవర్‌ వైపు నుంచి వచ్చే వాహనాలను చాపెల్‌ రోడ్‌ మీదుగా మళ్లించనున్నారు. 
 
గన్‌ఫౌండ్రీ ఎస్బీఐ నుంచి బషీర్‌బాగ్‌ ఫ్లైఓవర్‌ వైపు వచ్చే వాహనాలను చాపెల్‌ రోడ్‌ మీదుగా, రవీంద్రభారతి, హిల్‌ఫోర్ట్‌ రోడ్‌ వైపు నుంచి బీజేఆర్‌ స్టాట్యూ వైపు వచ్చే వాహనాలను సుజాత హైస్కూల్‌ మీదుగా మళ్లిస్తారు. 
నారాయణగూడ సిమెట్రీ వైపు నుంచి బషీర్‌బాగ్‌ వైపు వచ్చే వాహనాలను ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ వద్ద, కింగ్‌ కోఠి, బొగ్గులకుంట వైపు నుంచి భారతీయ విద్యా భవన్స్‌ మీదుగా వచ్చే వాహనాలను కింగ్‌ కోఠి చౌరస్తా నుంచి తాజ్‌ మహల్‌ హోటల్‌ మీదుగా మళ్లిస్తారు.
 
శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు చార్మినార్‌-మదీనా, చార్మినార్‌-ముర్గీ చౌక్, రాజేష్‌ మెడికల్‌ హాల్‌-శాలిబండ మధ్య వాహనాలను అనుమతించరు. వీటిని మదీనా జంక్షన్, హిమ్మత్‌పుర, చౌక్‌ మైదాన్‌ ఖాన్, మోతీగల్లీ, ఈదీ బజార్‌ చౌక్, షేర్‌ బాటిల్‌ కమాన్, ఓల్డ్‌ కమిషనర్‌ కార్యాలయం చౌరస్తా వైపు మళ్లిస్తారు. 
 
సికింద్రాబాద్‌ మహంకాళి పోలీస్‌షన్‌ నుంచి రామ్‌గోపాల్‌ పేట్‌ రోడ్‌ జంక్షన్‌ మధ్య మార్గాన్ని ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మూసేస్తారు. బాటా చౌరస్తా నుంచి సుభాష్‌ రోడ్‌ వైపు వచ్చే ట్రాఫిక్‌ను లాలా టెంపుల్‌ మీదుగా మళ్లిస్తారు. ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఆర్టీసీ బస్సులకు సైతం వర్తిస్తాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.