సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 సెప్టెంబరు 2023 (19:51 IST)

ఆటోపై పాత చెట్టు కూలిపోయింది.. డ్రైవర్ మృతి

Auto Driver
Auto Driver
హైదర్ ఓల్డ్ ఎమ్మెల్యే కాలనీలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగిన ఆటోపై పాత చెట్టు కూలిపోయింది. ఈ ఘటనపై ఆటో డ్రైవర్ మహమ్మద్ గౌస్ అక్కడికక్కడే మృతి చెందాడు. 
 
వివరాల్లోకి వెళితే.. సోమాజి గూడ ఎమ్ఎస్ మక్త ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ మహ్మద్ గౌస్ పాషా హిమాయత్ నగర్ నుంచి బషీర్ బాద్ వైపు వెళ్తున్నాడు. 
 
హైదర్ గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎదురుగా ట్రాఫిక్ సిగ్నల్ పడటంతో ఆటోను ఆపాడు. ఫుట్‌పాత్‌పై ఉన్న భారీ వృక్షం కూలి నేరుగా ఆటోపై పడింది. దీంతో ఆటోలో ఉన్న డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. 
 
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న నారాయణగూడ పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.