అమ్మాయిని అలా అడిగా... తప్పేంటి? గుండు కొట్టించినా తప్పు ఒప్పుకోడే...?!!

యువతిని వేధించిన పోరగాళ్లకు విచిత్ర శిక్షలు విధించారు ఆ ఊరి పెద్ద‌లు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ గ్రామానికి చెందిన ఓ బాలికను అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు వేధించారు. ఈ విష‌యాన్ని గందసిరిలో పెద్ద‌ల‌కు తెలియ‌చేసారు. దీంతో ఆ ఊరి పెద్ద ప

head-shave
srinivas| Last Modified శనివారం, 28 జులై 2018 (17:51 IST)
యువతిని వేధించిన పోరగాళ్లకు విచిత్ర శిక్షలు విధించారు ఆ ఊరి పెద్ద‌లు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ గ్రామానికి చెందిన ఓ బాలికను అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు వేధించారు. ఈ విష‌యాన్ని గందసిరిలో పెద్ద‌ల‌కు తెలియ‌చేసారు. దీంతో ఆ ఊరి పెద్ద పెదరాయుడి స్టైల్‌లో పంచాయితీ ఏర్పాటు చేసి విచిత్ర‌మైన తీర్పు ఇచ్చారు. 
 
ఇంత‌కీ ఆ తీర్పు ఏంటంటే... సదరు యువకులు గుంజీలు తీయటం, ముక్కు నేలకు రాయించడం, అరగుండు చేయించడం వంటివి అమలు చేయాలని తీర్పునిచ్చారు. ఆ పెద్ద పేరు రాంబాబు. ఈ సంఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా అమ్మాయిని వేధించిన యువకులను గుండు చేస్తున్న సమయంలో నీవు చేసింది తప్పేనని ఒప్పుకుంటున్నావా అని అడిగితే... నేనేం తప్పుచేయలేదు, అమ్మాయిని అలా అడిగితే తప్పేంటి అని అతడు ఎదురు ప్రశ్నలు వేయడం గమనార్హం.దీనిపై మరింత చదవండి :