శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By జె
Last Modified: బుధవారం, 19 ఆగస్టు 2020 (23:08 IST)

కోటి రూపాయల లంచం ఘటనే చెబుతోందంటూ కేసీఆర్ పైన రాములమ్మ ఫైర్

రాములమ్మకు కోపమొచ్చింది. తెలంగాణా రాష్ట్రంలో అసమర్థ పాలన కొనసాగుతోందంటూ విజయశాంతి కెసిఆర్ పైన ధ్వజమెత్తారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందంటూ మరోసారి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
ప్రస్తుతం విజయశాంతి తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీలో ఉన్నారు. గత కొన్నినెలలుగా రాజకీయాలపై సైలెంట్‌గా ఉంటూ వచ్చిన విజయశాంతి మళ్ళీ అరంగేట్రం చేసి ఫైరయ్యారు. తెలంగాణా రాష్ట్ర పరిపాలనా యంత్రాగం అన్ని రంగాల్లోను ఘోరంగా విఫలమైందని చెప్పడానికి తాజా పరిణామలే నిదర్శనం. 
 
చినుకుపడితే చాలు జలమయమయ్యే హైదరాబాదును ఎలాగూ కాపాడలేకపోయారు. ఇప్పుడు ప్రభుత్వ చేతగాని తనానికి వరంగల్ కూడా బలైంది. ఇక భూకబ్జాలను ఆపలేక రెవిన్యూ వ్యవస్థ ఎంత అద్భుతంగా పనిచేస్తోందో ఈ మధ్య బట్టబయలైన కోటి రూపాయల లంచం ఘటనే చెబుతోంది.
 
తెలంగాణాలో అత్యంత ప్రధానమైనది కోవిడ్.. కరోనా చికిత్సా కేంద్రాల్లో ఉన్న గాంధీ ఆసుపత్రి పలుమార్లు అగ్నిప్రమాదానికి గురైనా అక్కడ ఫైర సేఫ్టీ వ్యవస్థ నీరుగారి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుండి. ఇక కోవిడ్ చికిత్సా వ్యవస్థ అనేది అటు ప్రభుత్వాసుపత్రులు, ఇటు ప్రైవేటు ఆసుపత్రుల్లోను కుప్పకూలిపోయిందనడానికి హైకోర్టు వేసిన మొట్టిక్కాయల గాయాలే సాక్ష్యమంటూ రాములమ్మ ఫైరయ్యారు.