మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Updated : బుధవారం, 19 ఆగస్టు 2020 (17:39 IST)

విజయ్ దేవరకొండ చాలా హాట్, నాకు క్రష్ అంటున్న నటి కస్తూరి (Video)

పెళ్లి చూపులు సినిమాతో కమర్షియల్ సక్సస్ సాధించి... అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన యంగ్ హీరో విజయ్ దేవరకొండ. గీత గోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించి అనతి కాలంలోనే స్టార్ హీరో ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఈ సంచలన యువ హీరోకు యూత్‌లో మాంచి క్రేజ్ ఉంది.
 
అయితే... సామాన్యులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు కూడా విజయ్ దేవరకొండ అంటే ఇష్టం అంటున్నారు. ఓ సీనియర్ హీరోయిన్ విజయ్ దేవరకొండ అంటే చాలా అంటే చాలా ఇష్టం అని చెప్పింది. ఎంత ఇష్టం అంటే... ఏ హీరోకి అయినా మదర్‌గా నటిస్తుందట కానీ.. విజయ్‌కి మాత్రం మదర్ గా నటించదట.
 
ఇంతకీ ఎవరా హీరోయిన్ అంటారా.. కస్తూరి. అన్నమయ్య సినిమాలో నాగార్జున సరసన రమ్యకృష్ణతో పాటు నటించింది. విజయ్ గురించి ఇంకా ఏం చెప్పిందంటే... విజయ్ దేవరకొండకు తల్లిగా అస్సలు నటించను. గర్ల్ ఫ్రెండ్‌గా చేయమంటే చేస్తాను. విజయ్ అంటే నాకు చాలా క్రష్. అతడు పెర్ఫెక్ట్ హీరో. అతడు ఎలా ఉన్నా బాగుంటాడు. గడ్డంతో, దువ్వకుండా, షర్ట్ లేకుండా ఉన్నా కూడా బాగుంటాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే విజయ్ దేవరకొండ చాలా హాట్ అంటూ సిగ్గుపడుతూ చెప్పింది. అదీ.. సంగతి!