గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 ఫిబ్రవరి 2023 (18:01 IST)

బర్త్‌డే పార్టీకి పిలిచారు.. గదిలో బంధించి చితక్కొట్టాడు

birthday celebrations
తెలంగాణ రాష్ట్రంలో ఓ విచిత్ర ఘటన జరిగింది. తన కుమారుడి పుట్టిన రోజు వేడుకలకు ఓ వ్యక్తి తమ బంధువులను ఆహ్వానించాడు. దీంతో ఈ వేడుకలకు సంతోషంగా వచ్చిన వారిని గదిలో బంధించి చితకబాదాడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిలలా అత్వెల్లి గ్రామంలో జరిగింది. 
 
ఈ గ్రామానికి చెందిన నవీన్.. తన కుమారుడి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాడు. ఈ వేడుకలకు బంధు మిత్రులను ఆహ్వానించాడు. ఇంటికొచ్చిన వారంతా ఆనందంగా వేడుకల్లో నిమగ్నమై ఉన్న సమయంలో నవీన్ వచ్చిన బంధువులతో గొడవపడ్డాడు. 
 
ఈ క్రమంలో బంధువులందరినీ గదిలో బంధించి వారిపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. దీంతో ఎంతో ఆనందంగా జరగాల్సిన బర్త్‌డే వేడుక రసాభాసగా మారిపోయింది. ఈ ఘటనపై బాధిత బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వికారాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.