బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 18 మార్చి 2023 (15:25 IST)

లిక్కర్ స్కామ్‌లో కవిత వికెట్ పడిపోయింది.. బండి సంజయ్

bandi sanjay
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వికెట్ పడిపోయిందని బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ జోస్యం చెప్పారు. ఈ స్కామ్‌తో సంబంధం ఉన్న కవితను ఈడీ అధికారులు అరెస్టు చేయకుండా ముద్దు పెట్టుకుంటారా అని ఆయన చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి. దీంతో ఆయనపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై ఆయన తాజాగా వివరణ ఇచ్చారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితను అరెస్టు‌ను ప్రస్తావించే క్రమంలోనే ఇలా అన్నానని, ఇది దగ్గర వాడుకలో ఉన్న సామతేనని చెప్పారు. 
 
పైగా, లిక్కర్ స్కామ్‌లో కవిత్ వికెట్ పడిపోయిందన్నారు. మరికొందరు బీఆర్ఎస్ నేతలు కూడా త్వరలోనే క్లీన్ బౌల్డ్ అవుతారని ఆయన చెప్పారు. ఈ స్కామ్‌తో సంబంధం ఉన్నవారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు. కాగా, కవితపై చేసిన వ్యాఖ్యలకుగాను ఆయన శనివారం తెలంగాణ మహిళా కమిషన్ ఎదుట హాజరై వివరణ ఇచ్చారు. తాను తప్పు చేయలేదు కాబట్టే కమిషన్ ముందు హాజరయ్యాయని చెప్పారు.