పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎందుకు.. వదిలేయండి.. ఆడకండి: ఓవైసీ
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ భారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌లో ఆడేందుకు టీమ్‌ను పంపకూడదని భారత్ నిర్ణయించుకున్నప్పుడు ఆస్ట్రేలియాలో పాకిస్థాన్‌తో క్రికెట్ మ్యాచ్ ఆడకూడదని ఓవైసీ తెలిపారు.
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం భారత్-పాక్ మధ్య మ్యాచ్‌కు ఓవైసీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. పాకిస్థాన్‌కు భారత క్రికెటర్లు వెళ్లనప్పుడు పాకిస్థాన్‌తో క్రికెట్ మ్యాచ్ ఆస్ట్రేలియాలో ఎందుకు ఆడుతున్నారు? పాక్‌తో ఆడకుంటే ఏమవుతుంది? రూ.2వేల కోట్ల నష్టం వస్తుందా? కానీ, అది మన దేశం కంటే ముఖ్యమా? వదిలివేయండి, ఆడకండి అని అసదుద్ధీన్ కామెంట్లు చేశారు.
వచ్చే ఏడాది ఆసియా కప్ ఆడేందుకు భారత జట్టు పాకిస్థాన్‌కు వెళ్లబోదని బీసీసీఐ సెక్రటరీ జైషా చేసిన ప్రకటనపై ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏదేమైనా ఆదివారం పాక్‌తో జరిగే మ్యాచ్‌లో భారత్ గెలవాలని తాను కోరుకుంటున్నానని అసద్ చెప్పారు.