శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 6 మే 2022 (08:09 IST)

ఈత కొలను స్నానాల గదిలో సీక్రెట్ కెమెరా

cctv
తెలంగాణా రాష్ట్రంలో సూర్యాపేట జిల్లాలో ఓ ఘటన జరిగింది. ఈత కొలను స్నానాల గదిలో రహస్యంగా సీసీటీవీ కెమెరాను అమరి, యువతులు దుస్తులు మార్చుకోవడాన్ని చిత్రీకరిస్తున్న ఓ యువకుడి బండారాన్ని కనిపెట్టారు. 
 
ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు..జిల్లాలోని చివ్వెంల మండలం కుడకుడ గ్రామ పరిధిలోని ఓ ఈత కొలనులో గుగులోతు మహేశ్ అనే యువకుడు పనిచేస్తున్నాడు. 
 
మంగళవారం తన మొబైల్ కెమెరాను ఆన్‌చేసి రహస్యంగా అక్కడి స్నానాల గదిలో పెట్టాడు. అదే రోజు ఇద్దరు యువతులు స్నానాల గదిలో దుస్తులు మార్చుకుంటున్న సమయంలో అనుమానంతో పరిశీలించగా కెమెరా ఆన్‌‌చేసి ఉన్న మొబైల్ ఫోన్ కనిపించింది. 
 
దీంతో యువతులు ఈ విషయాన్ని తమ తల్లిదండ్రులకు చెప్పారు. వారు బుధవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న ఆ యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.