గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (10:46 IST)

అక్కనే లైంగిక వేధింపులకు గురిచేసిన తమ్ముడు

‘మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు’ అన్న సీనీ పాటను నిజం చేస్తూ ఓ కామాంధుడు వావివరుసలు మరిచి దారుణానికి ఒడిగట్టాడు.

వరుసకు అక్క అయ్యే మహిళపైనే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీనికి తోడు..తన వికృత చర్యలన్నీ సోషల్ మీడియాలో పెట్టాడు. ఇవన్నీ బాధితురాలి దృష్టికి రావడంతో ఆమె పోలీసులు ఆశ్రయించారు.

సోషల్ మీడియాలో అసభ్య మెసేజీలు పెడుతూ వేధింపులకు పాల్పడుతున్నాడని ఫిర్యాదు చేశారు.  కామాంధుడు వికృత చేష్టలకు పాల్పడినట్టు విచారణలో బయటపడటంతో సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేశారు.