శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (09:05 IST)

పెళ్లికి నిరాకరించిందనీ.. ప్రియురాలిని చంపేసిన ప్రేమికుడు

తెలంగాణ రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో ఓ ప్రియుడు తన ప్రియురాలిని దారుణంగా హత్య చంపేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
శ్రీకాకుళం జిల్లా పలాసాకు చెందిన మల్లిపురం సంతోష(28) పదేళ్ల క్రితం భర్తతో కలిసి జీవనోపాధి కోసం ఘట్‌కేసర్‌ మండలం ఏదులాబాద్‌కు వచ్చారు. ఇక్కడ శ్రీరామ పౌల్ట్రీ ఫారంలో పని చేస్తూ నివాసం ఉండేవారు. కుటుంబ సమస్యలతో నాలుగేళ్ల కిందట భర్త విడిచి వెళ్లిపోయాడు. 
 
కొన్ని రోజులుగా మహారాష్ట్రకు చెందిన వినోద్‌(28) సంతోషతో స్నేహితంగా ఉంటున్నాడు. వీరిద్దరూ పెళ్లి విషయమై గొడవ పడేవారు. డిసెంబరు 3న మధ్యాహ్నం ఇద్దరు ఏదులాబాద్‌ సమీపంలో ఉన్న ఖాళీ ప్రదేశానికి వెళ్లారు. 
 
వినోద్‌ వెంట తెచ్చుకున్న తాడుతో ఉరి వేసి చంపేశాడు. గురువారం తూంకుంటలో అతనిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.