నాగార్జున ‘మా టీవీ’లో... మరి అమల ‘ఏ టీవీ’లో

Amala
Eswar| Last Modified సోమవారం, 14 జులై 2014 (13:12 IST)
'మీలో ఎవరు కోటీశ్వరుడు’ అంటూ బుల్లితెరను షేక్ చేస్తున్నారు అక్కినేని నాగార్జున. ఈ షో మొదలైన కొన్ని వారాలకే
మంచి రేటింగ్‌తో ఫుల్ ఖుషీగా ఉన్నారు నాగార్జున. భర్త దారిలోనే భార్య అక్కినేని అమల కూడా అడుగులు వేస్తున్నారు. గతంలోనే మేకప్‌లకు పేకప్ చెప్పేసిన అమల మళ్లీ మేకప్ వేసుకుని బుల్లితెర మీదకు రానున్నారు.

టీవీ సీరియళ్లలో నటించబోతున్నారు. అయితే వీరిద్దరికీ చిన్న తేడా నాగార్జున తెలుగులో షో చేస్తుంటే.. అమల మాత్రం
ఉయెర్మి అనే తమిళ సీరియల్‌లో డాక్టర్ పాత్ర పోషిస్తున్నారు. 12 మంది వైద్యులు, వాళ్ల జీవితాలు, కుటుంబాలు, రోగుల నేపథ్యంలో సాగే ఈ సీరియల్ ఆగస్టు రెండోవారం తర్వాత ప్రసారం కావచ్చు అంటున్నారు అమల. మరి ఇంతకీ ఈ సీరియల్ ఏ టివీలో ప్రసారం కానుందో...దీనిపై మరింత చదవండి :