'టోల్‌ ఫ్రీ నెం.143' షూటింగ్‌ పూర్తి... ఈ నెలలో ఆడియో

ivr| Last Modified సోమవారం, 8 సెప్టెంబరు 2014 (21:21 IST)
భాస్కరా గ్రూప్‌ ఆఫ్‌ మీడియా పతాకంపై పోసాని కృష్ణమురళి కీలకపాత్రలో వి.ఎస్‌.వాసు తెరకెక్కిస్తున్న చిత్రం 'టోల్‌ ఫ్రీ నెం.143'. దాసరి భాస్కర్‌ యాదవ్‌ నిర్మాత. క్లబ్బులు, పబ్బులు, రేవ్‌ పార్టీలు అంటూ నటితరం యువత తమ జీవితాన్ని ఏ విధంగా పాడు చేసుకొంటున్నాయో ఈ చిత్రం ద్వారా చెప్పనున్నారు దర్శకుడు వి.ఎస్‌.వాసు.

చిత్రీకరణ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుపుకొంటున్న ఈ చిత్రం ఆడియోను సెప్టెంబర్‌లో విడుదల చేసి, అక్టోబర్‌లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత దాసరి భాస్కర్‌ యాదవ్‌ మాట్లాడుతూ... 'నేటి యువత చెడు దారులు పడుతూ.. ఏ విధంగా తమ కెరీర్‌ను నాశనం చేసుకొంటున్నారో చూపించనున్నాం.. వారిని సక్రమమైన మార్గంలో నడిపించే వ్యక్తిగా పోసాని చాలా మంచి పాత్రలో కనిపించనున్నారు. క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్‌ అవ్వకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం' అన్నారు.

చిత్ర దర్శకుడు వి.ఎస్‌.వాసు మాట్లాడుతూ... ''టోల్‌ ఫ్రీ నెం.143' చిత్రీకరణ పూర్తయింది. మా నిర్మాత దాసరి భాస్కర్‌ యాదవ్‌గారి సహకారంతో సినిమా చాలా బాగా వచ్చింది. పోసాని కృష్ణమురళిగారి క్యారెక్టర్‌ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది. అలాగే.. కృష్ణభగవాన్‌, సుమన్‌శెట్టి, ధనరాజ్‌, రోలర్‌ రఘు, చమ్మక్‌ చంద్ర వంటి కమెడియన్లు ఆద్యంతం నవ్విస్తారు' అన్నారు!దీనిపై మరింత చదవండి :