మంగళవారం, 28 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Updated : మంగళవారం, 22 సెప్టెంబరు 2020 (20:41 IST)

యాత్ర 2లో వైఎస్ జగన్‌గా నాగార్జున...! (Video)

వై.ఎస్ పాదయాత్ర కథాంశంగా మహి వి రాఘవ తెరకెక్కించిన చిత్రం యాత్ర. ఎన్నికల ముందు రిలీజైన యాత్ర సినిమా అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని.. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. దీంతో ఈ సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడు మహి వి రాఘవ. యాత్ర 2 పేరుతో రూపొందే ఈ సినిమాకి సంబంధించిన స్ర్కిప్ట్ వర్క్ జరుగుతుంది అనే వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్ పై మరింత ఆసక్తి ఏర్పడింది.
 
ఇందులో జగన్ పాత్రను నాగార్జున పోషించనున్నారు అని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఇది తెలిసినప్పటి నుంచి అసలు ఈ వార్త వాస్తవమేనా..? కాదా..? అని ఆరా తీస్తున్నారు. ఇంతకీ మేటర్ ఏంటంటే... మహి వి రాఘవ వైస్సార్ పాత్రనే నాగార్జునతో చేయించాలి అనుకున్నారు. అయితే... వై.ఎస్ ని ఎంతగానో అభిమానించే నాగార్జున యాత్ర సినిమాలో వై.ఎస్ పాత్ర పోషించడానికి ఓకే చెప్పారు కానీ.. ఎన్నికల ముందు ఈ సినిమా రిలీజ్ కాకుండా.. ఆ తర్వాత రిలీజ్ చేస్తామంటే నటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.
 
అయితే.. డైరెక్టర్ మహి వి రాఘవ మాత్రం ఎన్నికల ముందు రిలీజ్ చేయాలి అనుకోవడంతో వై.ఎస్ పాత్రను మలయాళ అగ్ర హీరో మమ్ముట్టితో చేయించారు. యాత్ర బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడంతో రెట్టించిన ఉత్సాహంతో ఇప్పుడు జగన్ పాదయాత్ర కధాంశంగా యాత్ర 2 తీయాలనుకుంటున్నారు.
 
ఇందులో జగన్ పాత్ర కోసం నాగార్జునను కాంటాక్ట్ చేసారని..  ప్రస్తుతం నాగార్జున, మహి వి రాఘవ మధ్య ఈ సినిమాకి సంబంధించి కథా చర్చలు జరుగుతున్నాయని తెలిసింది. మరి.. నాగ్ కనుక జగన్ పాత్ర చేయడానికి ఓకే చెబితే సంచలనమే..!