శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By TJ
Last Modified: గురువారం, 22 ఫిబ్రవరి 2018 (12:54 IST)

అమీ... నీకెందుకంత తొందర అంటున్నారట...

ప్రేమికుల దినోత్సవం రోజు తన ప్రియుడితో కలిసి వున్న ఫోటో పెట్టి ఇబ్బందులు పడింది బ్రిటీష్‌ భామ, హీరోయిన్ అమీ జాక్సన్. బ్రిటీష్‌‌కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి జార్జ్‌తో గత రెండుసంవత్సరాలుగా అమీ జాక్సన్ ప్రేమాయణంలో ఉంది. అయితే ఆ విషయాన్ని ఎక్కడా బయటక

ప్రేమికుల దినోత్సవం రోజు తన ప్రియుడితో కలిసి వున్న ఫోటో పెట్టి ఇబ్బందులు పడింది బ్రిటీష్‌ భామ, హీరోయిన్ అమీ జాక్సన్. బ్రిటీష్‌‌కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి జార్జ్‌తో గత రెండుసంవత్సరాలుగా అమీ జాక్సన్ ప్రేమాయణంలో ఉంది. అయితే ఆ విషయాన్ని ఎక్కడా బయటకు రానివ్వకుండా జాగ్రత్త పడింది. సినిమా షూటింగ్‌లో ఎప్పుడు ఖాళీ దొరికినా తన ప్రియుడిని కలిసేది అమీ జాక్సన్. అయితే మీడియా కంటపడకుండా మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.
 
కానీ ప్రేమికుల దినోత్సవం రోజు మాత్రం తన ట్విట్టర్ ఖాతాలో ప్రియుడితో ఉన్న ఫోటోను పంపింది. ఇప్పుడదే వైరల్‌గా మారి చివరకు త్వరలోనే పెళ్ళి పీటలెక్కేందుకు కారణమవుతోంది. ఎలాగంటారా.. ఇప్పటికే అమీ జాక్సన్‌కు పెళ్ళి చేయాలని తల్లి చాలా తొందరపడుతోందట. ఎవరైనా నీ మనస్సులో ఉంటే చెప్పమని తల్లి ఎన్నిసార్లు అడిగినా అమీ మాత్రం చెప్పలేదట. అయితే గత కొన్నిరోజుల ముందు ఏకంగా ప్రియుడితో కలిసి ఫోటో పెట్టడంతో ఇక తల్లి తొందరగా వీరి పెళ్ళి చేసేయాలని నిర్ణయానికి వచ్చేసిందట. 
 
అందుకే రజినీతో కలిసి నటిస్తున్న రోబో 2.0 సినిమా పూర్తయిన వెంటనే అమీకి పెళ్ళి చేసేయబోతున్నారు. ఈ యేడాది అక్టోబర్ నెలలోనే అమీ జాక్సన్ వివాహం జరుగనుంది. వివాహమైన తరువాత కూడా తాను సినిమాల్లో నటిస్తానని అమీ జాక్సన్ ఇప్పటి నుంచే డైరెక్టర్లకు చెబుతోందట. పెళ్ళి..పెళ్ళే.. సినిమా..సినిమానే అంటోందట బ్రిటీష్‌ భామ. అయితే అమీ జాక్సన్‌కు అంత త్వరగా వివాహమవ్వడం ఆమె అభిమానులను చాలా నిరుత్సాహపరుస్తోంది.