శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 29 జులై 2024 (20:29 IST)

చిన్న పిల్లలకు ముద్దు ఎలా పెట్టాలి.. అనసూయ మళ్లీ చిక్కింది..

Anasuya
మోస్ట్ యాంకర్‌లలో అనసూయ భరద్వాజ్ ఒకరు. ప్రస్తుతం ఆమె వివాదంలో చిక్కుకుంది. చిన్న పిల్లల షోలో ఆమె వారితో బుగ్గ మీద, పేదల మీద ముద్దులు పెట్టించుకోవడం, ఇలాంటి చర్యలు వల్ల ఈమె చిన్న పిల్లలకి ఏమి చెప్తుందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. 
 
కాగా ఇదే జుగుప్సాకర ఘటన‌పై టాలీవుడ్ ఫెమినిస్ట్ చిన్మయి శ్రీపాద పెట్టిన పోస్ట్ ఒకటి వైరల్‌గా మారింది. చిన్న పిల్లలతో లేడీ యాంకర్ అది కూడా అసభ్యంగా ప్రవర్తిస్తూ ముద్దులు పెట్టుకుంటూ కనిపిస్తుంది. 
 
కాగా దీనిపై ప్రముఖ సింగర్ అలాగే స్టార్ హీరోయిన్ సమంతకి డబ్బింగ్ కూడా చెప్పిన ప్రముఖ లేడీ చిన్మయి శ్రీపాద పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. ఈ పోస్ట్ వైరల్ కావడంతో అనసూయపై ట్రోలింగ్ మొదలైంది. 
 
ఇటీవల, చోటా ఛాంపియన్ షో నుండి పాత వీడియో మళ్లీ తెరపైకి వచ్చింది. ఇందులో ఏడేళ్ల చిన్నారి పెదవులపై ముద్దు పెట్టుకుంది. 
 
ఈ విషయంపై అనసూయ సోషల్ మీడియా వేదికగా ప్రస్తుతం, అనసూయ భరద్వాజ్ తనపై వచ్చిన ఆరోపణలను ప్రస్తావిస్తూ ఒక వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసింది. 
 
రెండో బిడ్డకు జన్మనిచ్చిన కొద్దిసేపటికే ఈ ఘటన జరిగిందని అనసూయ వివరించింది. ఆన్‌లైన్‌లో ప్రసారమవుతున్న సంభాషణలు, విమర్శలను ఆమె అంగీకరించింది.