అలా నన్ను చూడాలంటే ఎఫ్-2కి రండంటున్న అనసూయ

Anchor Anasuya
జె| Last Updated: శుక్రవారం, 4 జనవరి 2019 (16:32 IST)
యాంకర్ అనసూయ. ఈమె గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా కనిపించి అందరినీ అలరించింది. అంతేకాదు నాగార్జున, సాయి ధరమ్ తేజ్ అలాంటి వారితో నటించింది. సాయి ధరమ్ తేజ్‌తో అయితే ఏకంగా సూయ... సూయ అనసూయ అంటూ ఒక పాటందుకుంది. ఐటెం సాంగ్‌లో అనసూయ డ్యాన్స్ చూసిన యువ ప్రేక్షకులు ఎగిరి గంతేశారు.

అయితే మళ్ళీ అలాంటి ఛాన్స్ తెలుగు ప్రేక్షకులకు మళ్ళీ రానుంది. అదే ఎఫ్-2 సినిమాలో మరోసారి అనసూయ ఐటెం సాంగ్ చేయబోతోంది. సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్. దేవిశ్రీ అంటేనే ఐటెం సాంగ్ గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. ఆయన మ్యూజిక్ అందించే ప్రతి ఐటెం సాంగ్ హిట్టే.
Anchor Anasuya

ఎఫ్-2 సినిమాలో అనసూయ అందాలను బాగా చూపించారట. ఈ ఐటెం సాంగ్‌లో వెంకటేష్‌తో కలిసి దుమ్ము రేపే డ్యాన్స్ చేసిందట అనసూయ. మరి ఈ సాంగ్ చూడాలంటే 11వ తేదీ వరకు ఆగాల్సిందే.దీనిపై మరింత చదవండి :