బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 8 సెప్టెంబరు 2023 (20:38 IST)

గొరిల్లాతో నటించిన అంజలి.. బ్యాంకాక్‌కి వెళ్లి..?

Anjali look
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఫేమ్ అంజలి.. నిజమైన గొరిల్లాతో కలిసి నటించింది. ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్, కియారా అద్వానీ నటించిన గేమ్ ఛేంజర్ తెలుగు చిత్రంలో అంజలి నటించనుంది. ఆ తర్వాత తమిళంలో ఈగై అనే చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. 
 
ఇందులో అంజలి కీలక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాల్లో గొరిల్లాతో అంజలి నటించాల్సి ఉంది. ఇందుకోసం చిత్ర బృందంతో కలిసి అంజలి బ్యాంకాక్‌కి వెళ్లి సన్నివేశాలను చిత్రీకరించింది. 
 
ఇంతకుముందు తమిళ హీరో జీవా గొరిల్లా చిత్రంలో నిజమైన గొరిల్లాతో నటించాడు. ఆ సినిమా తర్వాత మళ్లీ అంజలి సినిమాలో అదే గొరిల్లాతో కలిసి ఆమె నటించింది.