బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : మంగళవారం, 19 డిశెంబరు 2017 (17:42 IST)

రామ్ చరణ్ సినిమాలో శివగామి.. ఎలాంటి పాత్ర?

సీనియర్ హీరోయిన్లకు ప్రస్తుతం కీలక రోల్స్ దక్కుతున్నాయి. అత్తారింటికి దారేది సినిమాలో నదియాకు, అజ్ఞాతవాసిలో ఖుష్బూకు, మిడిల్ క్లాస్ అబ్బాయిలో భూమికకు కీలక పాత్రలు లభించాయి. తాజాగా బోయపాటి- రామ్ చరణ్ క

సీనియర్ హీరోయిన్లకు ప్రస్తుతం కీలక పాత్రలు దక్కుతున్నాయి. అత్తారింటికి దారేది సినిమాలో నదియాకు, అజ్ఞాతవాసిలో ఖుష్బూకు, మిడిల్ క్లాస్ అబ్బాయిలో భూమికకు కీలక పాత్రలు లభించాయి. తాజాగా బోయపాటి- రామ్ చరణ్ కాంబోలో వస్తున్న చిత్రంలో బాహుబలి శివగామి ప్రధాన పాత్రలో కనిపిస్తున్నట్లు సమాచారం. 
 
చెర్రీతో రమ్యకృష్ణ పోటీపడే రోల్‌లో కనిపిస్తుందని టాక్ వస్తోంది. ఈ సినిమాలో చెర్రీ సరసన అనూ ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నట్లు టాక్ వస్తోంది. ఇక విలన్‌గా వివేక్ ఒబెరాయ్ నటించనున్నట్టు తెలిసింది. మాస్ ఆడియన్స్ ఆశించే అన్నిరకాల అంశాలతో బోయపాటి స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నారు. జనవరి 2వ వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.