డ్రగ్స్ కేసు.. నటి ఆషూ రెడ్డి ఫైర్.. ఆ వార్తలన్నీ ఫేక్
కేపీ చౌదరి, బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొన్న ఓ నటితోనూ వందల సంఖ్యలో ఫోల్స్ కాల్స్ చేసినట్టు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. కబాలి నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ కేసులో తనపేరు రావడంపై నటి ఆషూ రెడ్డి స్పందించారు.
తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఫైర్ అయ్యారు. తనకు డ్రగ్స్‌కు సంబంధించి ఎవరితో ఎటువంటి సంబంధాలు లేవని, తనపై వచ్చిన వార్తలన్నీ తప్పని స్పష్టం చేశారు.
అనుమతి లేకుండా తన ఫోన్ నెంబర్ ప్రచురిస్తే అస్సలు ఊరుకునేది లేదంటూ మండిపడ్డారు. ఇలాంటి ఆరోపణలు తనపై ఎందుకు వస్తున్నాయో అర్థం కావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు.