శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: గురువారం, 2 డిశెంబరు 2021 (19:32 IST)

ఈసారి రెడ్ జోన్‌లో ముగ్గురు యువతులు, ఎవరు?

బిగ్ బాస్ 5 సీజన్ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. రవిని ఎలిమినేట్ చేసిన తరువాత నెక్ట్స్ ఎలిమినేట్ ఎవరన్నది ఆసక్తికరంగా మారుతోంది. ముఖ్యంగా ఈసారి ముగ్గురు యువతుల పేర్లు ప్రధానంగా వినబడుతున్నాయి.

 
సిరి, ప్రియాంక, కాజల్‌లు ప్రస్తుతం డేంజర్ జోన్లో ఉన్నారట. అందులో సిరి కాస్త సేఫ్ జోన్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంటే కాజల్, ప్రియాంకలు మాత్రం ఖచ్చితంగా డేంజర్ జోన్ అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 
అయితే ప్రియాంకకు ఎవరూ ఓట్లు వేయకపోవడం.. కాజల్‌కు పెద్దగా ఓట్లు రాకపోవడంతో ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయిపోతారన్న ప్రచారం ఎక్కువగా ఉంది. ఇదిలా ఉంటే ఈసారి కెప్టెన్ ఎవరూ లేకపోవడంతో ఎవరు ఎలాంటి గేమ్ ఆడి పాయింట్లు తెచ్చుకుని ముందుకు వెళతారో లేదోనన్న ఆసక్తి నెలకొంది.