సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 10 ఏప్రియల్ 2021 (15:30 IST)

జాన్వీ కపూర్ అందాల ఆరబోత... ఫోటోలు వైరల్

jhanvi kapoor
యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ అందాల ఆరబోతకు ఏ మాత్రం అడ్డుకట్ట వేయట్లేదు. దొరికిందే ఛాన్స్ అన్న‌ట్టు గ‌త రెండు నెల‌లుగా విప‌రీత‌మైన గ్లామ‌ర్ షో చేస్తూ నెటిజ‌న్స్‌కు కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. రూహి సినిమా ప్ర‌మోష‌న్ అంటూ అప్పుడు వెరైటీ డ్రెస్‌ల‌లో అందాలు ఆర‌బోస్తూ ఫొటో షూట్ చేసిన జాన్వీ క‌పూర్ ప్ర‌స్తుతం మాల్దీవుస్ వేదిక‌గా అద‌ర‌గొడుతుంది. 
 
మొన్న‌టి వ‌ర‌కు వ‌రుస సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉన్న జాన్వీ క‌పూర్ షార్ట్ బ్రేక్ తీసుకొని మాల్దీవుల‌కి చెక్కేసింది. అక్క‌డ ప్ర‌కృతిని ఫుల్‌గా ఎంజాయ్ చేస్తూనే ఫొటో షూట్స్ చేస్తుంది. అయితే ఈ ఫొటో షూట్స్ చాలా హాట్ హాట్‌గా ఉండ‌డంతో నెటిజ‌న్స్ మైమ‌ర‌చిపోతున్నారు. 
jhanvi kapoor
 
ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ నిర్మిస్తున్న ‘ఘోస్ట్ స్టోరీస్’లో జాన్వీ నటిస్తోంది. గుడ్ లక్ జెర్రీ, కరణ్ జోహార్ దర్శకత్వం వహిస్తున్న తఖ్త్, ధర్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న దోస్తానా 2 ప్రాజెక్టులు లైన్‌లో ఉన్నాయి. తాజాగా మాల్దీవుల కోసం వెకేష‌న్‌లో భాగంగా వెళ్లిన జాన్వీ అక్క‌డి ప్ర‌కృతిని ఆస్వాదిస్తూ హాట్ హాట్‌గా ఫొటో షూట్స్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.