సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 12 జూన్ 2020 (22:44 IST)

కరోనా భయంతో శృతిహాసన్ ముంబై నుంచి హైదరాబాదుకి జంప్

కరోనా మహమ్మారి రోజురోజుకు విపరీతంగా పెరుగుతుంది. ముంబాయిలో అయితే.... విలయతాండవం చేస్తుంది. దీంతో బాలీవుడ్లో ఉన్న సినీ తారలు బాగా టెన్షన్ పడుతున్నారు. శృతిహాసన్ ముంబాయిలోనే ఉన్నారు. అక్కడ కరోనా విజృంభిస్తుండడంతో.. ఈ అమ్మడు బాగా టెన్షన్ పడిందట. ఇక అక్కడ ఉండటం క్షేమం కాదు అనుకుందట. అంతే.. వెంటనే మకాం మార్చేయాలని ఫిక్స్ అయ్యింది.
 
చెన్నైలో కూడా కరోనా రోజురోజుకు పెరుగుతుండటంతో హైదరాబాదే సేఫ్ ప్లేస్ అనుకుని భాగ్యనగరం చేరుకోవాలి అనుకుంది. అంతే వెంటనే రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ చేరుకుందని తెలిసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో కలిసి వకీల్ సాబ్ సినిమా చేస్తుంది. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు - బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీకపూర్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
 
తెలంగాణ రాష్ట్రం షూటింగ్స్‌కి పర్మిషన్ ఇవ్వడంతో త్వరలో వకీల్ సాబ్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు శృతిహాసన్ మాస్ మహారాజా రవితేజతో క్రాక్ సినిమా కూడా చేస్తుంది.
 
 ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలో స్టార్ట్ కానుంది. ఎలాగూ త్వరలో షూటింగ్స్ ప్రారంభం కానున్నాయి కాబట్టి హైదరాబాద్ లోనే ఉండాలని ఫిక్స్ అయ్యింది. అందుకోసం ప్రత్యేకంగా ఇల్లు అద్దెకు తీసుకుందని సమాచారం.