ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఐవీఆర్
Last Updated : శుక్రవారం, 9 జులై 2021 (21:19 IST)

దీపిక పదుకునెను అలా చూసుకుంటున్నందుకు అతడికి ఏడాదికి కోటి

సెలబ్రిటీల లైఫ్ స్టైల్ చాలా కాస్ట్లీ. అంతేకాదు వాళ్లను కంటికి రెప్పలా చూసుకునే బాడీ గార్డులకు కూడా అంతే కాస్ట్లీలో పైకం అందుతుంది. ఐతే ఇది అందరి విషయంలో అనుకుంటే పప్పులో కాలేసినట్లే. కొందరి విషయంలో మాత్రమే ఇది వాస్తవం.
 
బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునెను తీసుకుంటే ఆమెకి బాడీ గార్డుగా వుండే జలాల్ అనే వ్యక్తి నెలకి సుమారు 7 లక్షల రూపాయలు జీతంగా అందుకుంటున్నాడట. ఇది అతడు డిమాండ్ చేసి తీసుకుంటున్నది కాదు, తనను ఎన్నో ఏళ్లుగా కంటికి రెప్పలా కాపాడుతున్నందుకు దీపికా ఫిక్స్ చేసిన మంత్లీ శాలరీ.
 
అంతేకాదు... పండగలూ పబ్బాలూ వస్తే విలువైన బహుమతులు జలాల్ ఇంటిని పలుకరిస్తుంటాయని బాలీవుడ్ సినీజనం సమాచారం. మొత్తమ్మీద ఏడాదికి కోటి రూపాయల వరకూ జలాల్ కు ముడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.